Vizag: విశాఖ దుర్ఘటనలో.. హృదయవిదారక దృశ్యాలు

gas leak images in vizag
  • 9కి చేరిన మృతుల సంఖ్య
  • 187 మందికి చికిత్స
  • రోడ్లపైనే పడిపోయిన ప్రజలు

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. విశాఖ కేజీహెచ్‌లో 187 మందికి చికిత్స అందిస్తున్నారు. అపోలోలో 48, విశాఖ సెవెన్ హిల్స్‌లో 12 మందికి, ఇతర ఆసుపత్రుల్లో మిగతావారికి చికిత్స అందిస్తున్నారు.

ఆర్‌ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు బస, ఆహారం ఏర్పాటు చేశారు. గ్యాస్‌ లీక్ వల్ల 22 పశువులు, 6 కుక్కలు మృతి చెందాయని అధికారులు ప్రకటించారు. అస్వస్థతకు గురైన 62 పశువులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో కనపడుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా వున్నాయి.

                   
           

  • Loading...

More Telugu News