Vizag: విశాఖలో ఎనిమిదికి చేరుకున్న మృతుల సంఖ్య

Vizag gas leak deaths rises to 8
  • అధికారులు, మీడియా ఉన్న సమయంలో మరోసారి గ్యాస్ లీక్
  • వైజాగ్ లో తీవ్ర కలకలం
  • భయాందోళనలకు గురవుతున్న ప్రజలు
విశాఖలోని ఎల్జీ  పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఐదు గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తరలించారు. గ్యాస్ కారణంగా అస్వస్థతకు గురైన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఫ్యాక్టరీ నుంచి మరోసారి గ్యాస్ వాసన వచ్చింది. దీంతో అక్కడున్న అధికారులు, మీడియా సిబ్బంది... మళ్లీ గ్యాస్ లీకైందేమోనని ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ... ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ కాసేపటి క్రితం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వైజాగ్ బయల్దేరారు.
Vizag
Vizag Gas Leak
LG Polymers

More Telugu News