Police: సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్.. అరెస్ట్!

Costable who robbed liquor bottles arrested in Telangana
  • లాక్ డౌన్ సమయంలో 69 బాటిల్స్ సీజ్ చేసిన కరీంనగర్ పోలీసులు
  • కాంట్రాక్ట్ ఉద్యోగి సాయంతో కొన్ని బాటిల్స్ ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్
  • సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని విద్యానగర్ లో ఒక వ్యక్తి నుంచి 69 మద్యం బాటిళ్లను పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాటిని చూసుకునే  బాధ్యతను కోర్టు విధులు చూసే ఓ కానిస్టేబుల్ కు అప్పగించారు.

అయితే, సదరు కానిస్టేబుల్ ఇదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సాయంతో స్ట్రాంగ్ రూమ్ తలుపులను తీసి, సీజ్ చేసిన వాటి నుంచి కొన్ని మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. అయితే ఇవన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సీసీఎస్ పోలీసులతో విచారణ జరిపించి... వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు.
Police
Constable
Karimnagar
Liquor bottles

More Telugu News