ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా.. ఎస్ఈసీ ప్రకటన
- ప్రస్తుత పరిస్థితులతో ఎన్నికల నిలిపివేత కొనసాగింపు
- పరిస్థితులు అనుకూలించాక నిర్ణయం తీసుకుంటాం
- ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ సమీక్ష
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ నిలిపివేయాలని నిర్ణయించారు. ‘కరోనా’ అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా’ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఈ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ ఇవాళ సమీక్షించారు.