Chandrababu: కర్ణాటకలో చిక్కుకుపోయిన మన మత్స్యకారుల కోసం సీఎం యడియూరప్పతో మాట్లాడాను: చంద్రబాబు

Chandrababu Naidu tweet
  • శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు 300 మంది కర్ణాటకలో చిక్కుకుపోయారు
  • ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు
  •  వారికి తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు
లాక్ డౌన్  కారణంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఏపీకి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో మాట్లాడానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు కర్ణాటక తీర ప్రాంతం మాల్ప్ గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

యడియూరప్ప సానుకూలంగా స్పందించారని, చిక్కుకుపోయిన మత్స్యకారులకు తక్షణ సాయం అందిస్తామని తనకు హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారులను సురక్షితంగా తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తమ బృందం కూడా ఏపీ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తన వరుస ట్వీట్లలో చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
Yedi yurappa
Karnataka
cm

More Telugu News