Tamannaah: పాకిస్థానీ క్రికెటర్ తో తమన్నా.. వైరల్ అవుతున్న పాత ఫొటో!

Tamannah old pic with cricketer Abdul Razzak goes viral
  • అబ్దుల్ రజాక్ తో తమన్నా
  • జువెలరీ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఫొటో
  • పాత ఫొటో అయినా వైరల్ అవుతున్న వైనం
సినీ తారలు, క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. ఇక ఒక హీరోయిన్, ఓ క్రికెటర్ కు సంబంధించిన విషయమైతే... అది వైరల్ కావాల్సిందే. తాజాగా సినీ నటి తమన్నా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత ఫొటో అయినప్పటికీ... ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. ఓ జువెలరీ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఫొటోను తీశారు.
Tamannaah
Abdul Razzak
Tollywood
Bollywood
Photo

More Telugu News