షిర్డీ ఆలయంపై లాక్ డౌన్ ఎఫెక్ట్... రోజుకు ఎంత నష్టపోతోందంటే..!
- భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ప్రముఖ ఆలయాలు
- షిర్డీకి రోజుకు రూ. 6 లక్షల ఆదాయం మాత్రమే వస్తున్న వైనం
- జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే రూ. 150 కోట్ల నష్టం
వాస్తవానికి షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంటే ప్రతిరోజు సరాసరి రూ. 1.64 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట. ఈ లెక్కన లాక్ డౌన్ కారణంగా ప్రతి రోజు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే టెంపుల్ ట్రస్ట్ ఏకంగా రూ. 150 కోట్ల మేర నష్టపోతుంది. ఈ నష్టం ఆలయ ట్రస్టు చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.