Petorol: ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు!

WAT on petrol and diesel hiked in Delhi
  • ఇప్పటికే మద్యంపై 70 శాతం పెంపు
  • పెట్రోల్ పై 3 శాతం పెంపు
  • డీజిల్ పై 13.25 శాతం పెంపు
మందుబాబులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే షాక్ ఇచ్చారు. కరోనా ఫీజు పేరుతో మద్యంపై 70 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మరో నిర్ణయాన్ని కూడా ఢిల్లీ సర్కారు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ప్రస్తుతం వసూలు చేస్తున్న 27 శాతం వ్యాట్ ను 30 శాతానికి పెంచింది. డీజిల్ పై వ్యాట్ ను 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచేశారు. ఈ రాత్రి నుంచి వ్యాట్ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి.
Petorol
Deisel
WAT
Arvind Kejriwal
Delhi

More Telugu News