జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్... జులై 26న నీట్
- లాక్ డౌన్ కారణంగా పలు పరీక్షల వాయిదా
- కొత్త తేదీలు ప్రకటించిన కేంద్రం
- ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు!
జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ జులై 26న ఉంటుందని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరగొచ్చని అన్నారు. పరీక్ష తేదీలు ఇంకా నిర్ణయించలేదు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటిస్తారు. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. నీట్ కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.