Maharashtra: మహారాష్ట్రలో మరో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

Another 12 policemen in Maharashtra are Corona positive
  • కరోనా బారినపడిన జేజేమార్గ్‌ పోలీసులు
  • బాధితుల్లో ఆరుగురు ఎస్సైలు
  • 40 మంది సెల్ఫ్ క్వారంటైన్
కరోనా వైరస్‌తో అల్లాడుతున్న మహారాష్ట్ర పోలీసు శాఖలోనూ కేసులు పెరుగుతున్నాయి. జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 12 మంది పోలీసులకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. 12 మందిలో 8 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ కరోనా లక్షణాలు బయటపడలేదని (అసింప్టమాటిక్) తేలింది.

బాధిత పోలీసుల కుటుంబ సభ్యులు సహా 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు తరలించినట్టు ఏసీపీ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు. కాగా, ఆదివారం పైథోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి, నాగ్‌పాడాకు చెందిన ముగ్గురు, మహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు.
Maharashtra
Corona Virus
JJ Marg Police Station

More Telugu News