nagababu: ఆ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: విజయ్ దేవరకొండకు నాగబాబు సపోర్ట్

Nagababu TheDeverakonda  hai vijay i strongly support you
  • అసత్య ప్రచారం చేస్తున్నారని వెబ్‌సైట్లపై విజయ్‌ దేవరకొండ ఆగ్రహం
  • స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ ఆలస్యం చేసిందన్న నాగబాబు 
  • వారు జలగల్లా మన రక్తం తాగుతున్నారన్న మెగా బ్రదర్  
తనపై నాలుగు వెబ్‌సైట్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని సినీనటుడు విజయ్‌ దేవరకొండ నిన్న మండిపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు సినీ పరిశ్రమ నుంచి భారీగా స్పందన వస్తోంది. తాజాగా సినీనటుడు నాగబాబు కూడా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలిపారు.

'హాయ్‌ విజయ్.. నేను నీకు మద్దతు తెలుపుతున్నాను. ఇటువంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ నుంచి వారు జలగల్లా రక్తం పీల్చుకుని  తాగుతున్నారు. నీ ప్రతి స్పందనకు కృతజ్ఞతలు. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఫేక్‌న్యూస్‌ను, గాసిప్‌ వెబ్‌సైట్లను లేకుండా చేయాలని అన్నారు.

కాగా, విజయ్‌ దేవరకొండకు ఇప్పటికే మహేశ్ బాబుతో పాటు అల్లరి నరేశ్, రవితేజ, హరీశ్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, కొరటాల శివతో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఫేక్‌న్యూస్‌ను, గాసిప్‌ వెబ్‌సైట్లను అంతమొందించాలంటూ ట్వీట్లు చేశారు.
nagababu
Tollywood
Vijay Devarakonda

More Telugu News