మందుబాబులకు కేజ్రీవాల్ షాక్... 'కరోనా ఫీజ్' పేరిట 70 శాతం అదనపు బాదుడు!
- రూ. 1,000 ఎంఆర్పీ బాటిల్ ఖరీదు రూ. 1,700
- స్పెషల్ కరోనా ఫీజ్ పేరిట అదనపు పన్ను
- నేటి నుంచి అమలులోకి కొత్త ధరలు
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలంటే, లిక్కర్ అమ్మకాలే శ్రేయస్కరమని భావించిన ప్రభుత్వం, ఈ మేరకు ధరలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతినగా, పన్ను వసూళ్లు సైతం మందగించిన నేపథ్యంలో నిన్న సమావేశమైన కేజ్రీవాల్ క్యాబినెట్ 70 శాతం సుంకాలు విధిస్తూ, నిర్ణయం తీసుకుంది.