నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
- ఎస్ఈసీ పదవి నుంచి రమేశ్ కుమార్ తొలగింపు
- ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఈ పిటిషన్ పై దాదాపు 5 గంటల పాటు వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు ఉన్నందున, రేపటి విచారణలో మరికొందరు పిటిషనర్ల వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది.