RGV: మద్యం దుకాణం ముందు యువతులు క్యూలో నిలబడిన ఫొటోను పోస్టు చేసిన వర్మ

Ram Gopal Varma posts a pic that shows some girls standing in a line at a wine shop
  • దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు షురూ
  • కర్ణాటకలో ఓ వైన్ షాపు ముందు అమ్మాయిలు
  • చూడండి ఎవరు నిలబడ్డారో అంటూ వర్మ ట్వీట్
సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దాంతో ఏ వైన్ షాపు ముందు చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. అయితే, కర్ణాటకలో ఓ మద్యం దుకాణం ముందు జీన్స్ ప్యాంట్లు ధరించి ఆధునికంగా ఉన్న అమ్మాయిలు కూడా క్యూలో ఉండడం విస్తుగొలుపుతోంది. ఈ ఫొటోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పంచుకున్నారు. మద్యం దుకాణం ముందు లైన్లో ఎవరు నిలుచుని ఉన్నారో చూడండి అంటూ ట్వీట్ చేశారు. అబ్బో, తాగుబోతుల నుంచి మహిళలను రక్షించడానికి ఎంతో చేస్తున్నాం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
RGV
Wine Shop
Girls
Karnataka
Lockdown

More Telugu News