USA: ఔషధ నిల్వలు పెంచుకునేందుకే చైనా కరోనా వ్యాప్తిని దాచింది: అమెరికా తీవ్ర ఆరోపణలు

US accuses China for late reveal of corona virus spreading
  • చైనాలో మొదలైన కరోనా వైరస్
  • చైనా ఔషధాల దిగుమతులు పెంచుకుందన్న అమెరికా
  • అదే సమయంలో ఎగుమతులు తగ్గించిందని వివరణ
వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వచ్చిందంటున్న అమెరికా, తాజాగా చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో ఔషధ నిల్వలు పెంచుకునేందుకే చైనా కరోనా వ్యాప్తి అంశాన్ని దాచిందని అమెరికా పేర్కొంది.

 వైరస్ తీవ్రత గురించి చైనాకు మొదట్లోనే అర్థమైందని, దాంతో ఆ వైరస్ ను ఎదుర్కోవడానికి అవసరమైన ఔషధాలను నిల్వచేసుకోవాలని భావించిందని అమెరికా ఆరోపించింది. ఒకవేళ వైరస్ ప్రభావం గురించి బయటి దేశాలకు తెలిస్తే, ఔషధాల కోసం పోటీ ఏర్పడుతుందని భావించి, ఉద్దేశపూర్వకంగానే కరోనా విషయాన్ని ఆలస్యంగా వెల్లడించిందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నివేదికలో పేర్కొన్నారు.

కరోనా ఉద్ధృతి పెద్దగా లేదంటూనే దిగుమతుల్ని భారీగా పెంచుకుందని, ఎగుమతుల్ని మాత్రం గణనీయంగా తగ్గించుకుందని ఆ నివేదికలో వివరించారు. ఇతర దేశాల నుంచి చైనా తగినంతగా ఔషధాలు దిగుమతి చేసుకున్నాకే వైరస్ గురించి బయటి ప్రపంచానికి వెల్లడైనట్టు అర్థమవుతోందని తెలిపారు. చైనాలో గత డిసెంబరు నుంచి కరోనా ప్రభావం మొదలైనా, ఇతర దేశాలకు దాని తీవ్రత అర్థమయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది బలయ్యారు.
USA
China
Corona Virus
Spreading
Wuhan

More Telugu News