రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు

  • ముస్లింలను రెచ్చగొట్టే ప్రణాళిక
  • బాంద్రా ఘటనకు, మసీదుకు సంబంధం లేదు
  • చానల్ ద్వారా ముస్లింలపై విద్వేషం నింపే ప్రయత్నం
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అర్నాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.

బాంద్రాలోని ఓ మసీదు లక్ష్యంగా ముస్లింలపై అర్నాబ్, అతడి చానల్ ద్వారా విద్వేషం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 14న బాంద్రాలో జరిగిన వలస కార్మికుల నిరసనకు, బాంద్రాలోని మసీదుకు ఎటువంటి సంబంధం లేదని ఆ ఫిర్యాదులో ఇర్ఫాన్ పేర్కొన్నారు.  

బాంద్రాకు చేరుకున్న వలస కూలీలు మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలోకి చేరారని, కానీ అర్నాబ్ మాత్రం మత ఘర్షణలకు ఆ మసీదు ప్రయత్నిస్తోందని తన షోలో చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ షోలో అర్నాబ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో మసీదులో జనం ఎందుకు కనిపించారని ప్రశ్నించారని, ఇది ముమ్మాటికీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికేనని ఆయన ఆరోపించారు. ఇర్ఫాన్‌ ఫిర్యాదుతో అర్నాబ్‌పై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు వివరించారు.


More Telugu News

Arnab Goswami Mumbai ommunal hatred Bandra mosque