Lashker e toiba: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

  • ఉత్తర కశ్మీర్ లోని హం ద్వారా లో  ఎన్ కౌంటర్
  • ఈ ఎన్ కౌంటర్ లో హైదర్ హతమయ్యాడు
  • కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడి 
ఉత్తర కశ్మీర్ లోని హం ద్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హైదర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.  కాగా, హం ద్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా సిబ్బందిని ఐదుగురిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు.

ఈ ఐదుగురిలో కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన కల్నల్ పేరు అశుతోష్ శర్మ. 21వ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ లో విధులు నిర్వహించేవారు.  ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయన పరాక్రమానికి, ఆయన నిబద్ధతకు గాను శౌర్య, సేన పతకాలతో కేంద్రం గతంలో  గౌరవించింది.
Lashker e toiba
commander
Hyder
encounter
Jammu And Kashmir

More Telugu News