Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలు 'జాంతోప్సియా' వ్యాధితో బాధపడుతున్నారు: గోరంట్ల

Gorantla Butchaiah Choudary take a dig at YSRCP leaders
  • తెల్లకనుగుడ్డు పచ్చబడడమే 'జాంతోప్సియా' అని వివరణ
  • పారాసిటమాల్ వేసుకుంటే జబ్బు ముదురుతుందని ఎద్దేవా
  • తూర్పు తిరిగి దణ్ణం పెట్టాలంటూ వ్యంగ్యం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు తెల్ల కనుగుడ్డు పచ్చబడడం అనే సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధిని 'జాంతోప్సియా' అంటారని కూడా వివరించారు.

"ఒకవేళ దీనికి కూడా పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటారేమో. పచ్చకామెర మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో వెంటిలేటర్లు కూడా లేవు, పనిచేయని టెస్టింగ్ కిట్లు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బాగా అలవాటైన పని ఒకటి చేయండి. తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి. అప్పటికీ అటువైపు కూడా పచ్చగా ఉందంటే అది మీ దురదృష్టం" అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మేరకు గోరంట్ల ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News