Nara Lokesh: వైఎస్ తోడల్లుడు కుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!: నారా లోకేశ్

Lokesh alleges there was breach in Tirumala shrine
  • తిరుమల క్షేత్రంలో వైవీ పుట్టినరోజు వేడుకలు!
  • నిబంధనలు తుంగలో తొక్కారంటూ లోకేశ్ ఆగ్రహం
  • నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ అంటూ ట్వీట్
తిరుమల క్షేత్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. "ఆపద మొక్కుల వాడా, అనాథ రక్షకా! నీకు పేద, ధనిక అనే తేడా లేదంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శన భాగ్యమే లేదు, కానీ వైస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!" అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

"దేవదేవుడి ఉత్సవాలతో అలరారిన తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారినవేళ, నిబంధనలు తుంగలో తొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!" అంటూ వ్యాఖ్యానించారు.
Nara Lokesh
YV Subba Reddy
Tirumala
Birthday
TTD

More Telugu News