Chiranjeevi: 'మై డియర్ బచ్చా.. మా అమ్మ దగ్గర నీ 'బట్టర్' ఉడకదురా' అంటూ చెర్రీకి కౌంటర్‌ ఇచ్చిన చిరంజీవి

chiranjeevi about ramcharan video
  • వెన్న తీయడం నేర్చుకున్న చెర్రీ
  • తల్లి, నానమ్మలతో కలిసి వీడియో
  • స్పందించిన చిరు
  • నానమ్మ వద్ద తన కన్నా చెర్రీ బెటర్‌ కాలేడని వ్యాఖ్య
లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. రామ్‌ చరణ్‌ తన తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవితో కలిసి పెరుగు నుంచి వెన్న తీయడం నేర్చుకుని ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. గ్రాండ్‌మా రిసిప్, మమ్‌బాస్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.

అయితే, దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చెర్రీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మై డియర్ బచ్చా... మా అమ్మ దగ్గర నీ 'బట్టర్' ఉడకదురా. ఫస్ట్  ప్లేస్ ఎప్పుడూ నాదే. నీవు ఎంతగా బుజ్జగించి నీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా ఆమె వద్ద నువ్వు నా కన్నా బెటర్‌ కాలేవు. కానీ, అదే గ్యారంటీ  నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీ పోస్ట్ చేశారు.
Chiranjeevi
Ramcharan
Viral Videos
Tollywood

More Telugu News