Andhra Pradesh: ఏపీలో మరిన్ని కేసుల నమోదు.. కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ!

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  

జిల్లాల వారీగా వివరాలు...             
                             
గ్రాఫ్ రూపంలో..                   
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
COVID-19

More Telugu News