Hyderabad: హైదరాబాద్‌లో యునానీ వైద్యుడికి కరోనా పాజిటివ్

Corona positive for Unani doctor in Hyderabad
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో చేరిక
  • నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ‘గాంధీ’కి తరలింపు
  • ఆయన ఇంటిని సెల్ఫ్ క్వారంటైన్‌గా ప్రకటించిన అధికారులు
హైదరాబాద్‌లోని ఓ యునానీ వైద్యుడు కరోనా బారినపడ్డాడు. మంగళహాట్‌లోని న్యూ ఆగాపురకు చెందిన యునానీ వైద్యుడు న్యూ ఉస్మాన్‌గంజ్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా క్లినిక్ మూసేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, గత నెల 29న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

ఆయనకు కరోనా సోకినట్టు నిన్న ఉదయం నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబ సభ్యులతోపాటు వాచ్‌మన్‌ను స్వెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అలాగే, ఆయన నివసించే ఆగాపురలోని ఇంటిని జీహెచ్ఎంసీ, పోలీసులు అధికారులు సెల్ఫ్ క్వారంటైన్‌గా ప్రకటించారు.
Hyderabad
mangalhat
unani doctor
Corona Virus

More Telugu News