Corona Virus: దేశంలో కరోనా ఎప్పుడు అదుపులోకి రావచ్చో వెల్లడించిన అధ్యయనం

coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో మే 21 నాటికి కరోనా వైరస్ అదుపులోకి రావచ్చని ముంబై స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ పేర్కొంది. తాను చేసిన ఓ అధ్యయనం ద్వారా సదరు సంస్థ ఈ విషయంలో ఓ అంచనాకు వచ్చింది. లాజిస్టిక్‌ డిస్ట్రిబ్యూషన్ విధానంలో భారత్‌లో కరోనా లెక్కలను అంచనా వేసి ఈ ఫలితాలు వెల్లడించారు. కరోనా వైరస్ మొదట విజృంభించి, గరిష్ఠ స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నట్లు వివిధ దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే తెలిసిందని చెప్పారు.

ఈ లెక్కల ఆధారంగా భారత్‌లో కరోనా‌ వ్యాప్తి రేటును బట్టి అధ్యయనం చేశామని వివరించారు. మే 21 నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 24,222కు చేరుతుంది. గుజరాత్‌లో 4,833 కేసులు ఉంటాయి. అప్పటికి కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుందని తెలిపింది. ఈ వివరాలను 'ఎండ్‌ ఈజ్‌ నియర్‌' పేరిట ప్రచురించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
Lockdown
India

More Telugu News