Corona Virus: ఏపీలో మరో 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,902 శాంపిళ్లను పరీక్షించగా 60 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,463గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 403 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,027గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 6,  గుంటూరులో 19, కడపలో 6, కర్నూలులో 25, విశాఖపట్నంలో 2, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  

జిల్లాల వారీగా వివరాలు...              
                             
గ్రాఫ్ రూపంలో..       
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News