Raghavendra Rao: సమస్త దేవతలకూ నా ప్రార్థన ఇదే... దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వీడియో!

Raghavendrarao Pray to all Gods
  • కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు
  • ఈ పోరులో విజయానికి అవసరమైన శక్తి, ఆరోగ్యాలను ప్రసాదించాలి
  • రాఘవేంద్రరావు ప్రత్యేక పూజలు
కరోనా మహమ్మారి విజృంభించిన ఈ తరుణంలో, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ పై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పోరాటంలో వారు విజయం సాధించడానికి అవసరమైన శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సమస్త దేవతలనూ వేడుకున్నారు. తన ఇంట్లోని దేవతా ప్రతిమలను ఓ చోటకు చేర్చిన ఆయన, వాటిని శుభ్రంచేసి, ప్రత్యేక పూజలు జరిపారు.

"సకల దేవతలను ఒకటే ప్రార్థిస్తున్నాను. ప్రజలందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి త్వరగా రక్షించమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా రాత్రింబవళ్ళు నిత్యమూ ప్రజల సేవలో నిమగ్నమైన వైద్యులకి, వైద్య సిబ్బందికి, పోలీస్ శాఖకి వారి సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి, రైతన్నలకి, ఎందరో దాతలకి, ప్రభుత్వ ఉద్యోగులకి.. అందరికీ కరోనాపై పోరాటంలో తగినంత శక్తి, ఆరోగ్యం ప్రసాదించమని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాను" అని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
Raghavendra Rao
Twitter
Video
Pray

More Telugu News