Nagarjuna: 50 కథలు విన్నా నాగ్ కి ఒక్కటీ నచ్చలేదట!

Bangarraju Movie
  • పరాజయం పాలైన 'మన్మథుడు 2'
  •  కథల విషయంలో నాగ్ మరింత శ్రద్ధ
  • 'బంగార్రాజు' తరువాత ప్రాజెక్టుపై ఆసక్తి    

నాగార్జునకి ఇటీవల కాలంలో హిట్ పడక చాలా కాలమే అయింది. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. ఈ మధ్య ఆయన చేసిన 'మన్మథుడు 2' పరాజయం పాలైంది. అప్పటి నుంచి నాగార్జున వరుసగా కథలను వినడంపైనే దృష్టి పెట్టారట.

అలా ఆయన ఇంతవరకూ 50 కథల వరకూ విన్నారట. అయినా ఒక్క కథ కూడా నచ్చలేదని తెలుస్తోంది. కథలను వినిపించినవారిలో స్టార్ డైరెక్టర్లు .. సీనియర్ డైరెక్టర్లు ఉండటం విశేషం. కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రలలో వైవిధ్యం ఉండేలా ఆయన చూస్తున్నారని అంటున్నారు. అలాంటి విభిన్నమైన కథ కోసం ఆయన ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' తరువాత ఆయన ఏ సినిమా చేయనున్నాడు? ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News