Coca cola: కరోనాపై పోరుకు కదిలొచ్చిన కోకా కోలా.. రూ. 100 కోట్ల సాయం!

  • కనీసం 10 లక్షల మందికి లబ్ధి
  • ఆరోగ్య సంరక్షణ, పేదల సాయానికి నిధుల ఖర్చు
  • నిరుద్యోగులు, వలస కూలీలకు ఆహారం, పానీయాలు అందించనున్న సంస్థ
Coca Cola pledges initial support of Rs 100 crore to combat Covid

భారత్ లో కరోనా వైరస్‌‌పై జరుగుతున్న పోరులో ప్రముఖ శీతలపానీయాల తయారీ సంస్థ కోకాకోలా కూడా ముందుకొచ్చింది. వంద కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించింది. ఈ సొమ్మును ఆరోగ్య సంరక్షణ, పేదల సాయానికి వెచ్చించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఏజంట్ల ద్వారా 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో అవసరమైన వారికి పానీయాలను కూడా సరఫరా చేస్తామని ప్రకటించింది.

కోకాకోలా ఫౌండేషన్, అట్లాంటా మద్దతుతో యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, వలస కూలీలకు ఆహారం, పానీయాలు అందించనున్నట్టు తెలిపింది. భారత్‌లో తాము ప్రారంభించిన ఉపశమన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది.

More Telugu News