Jagan: ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజు కట్టివుంటే ఆ డబ్బు వెనక్కి ఇవ్వండి: కాలేజీలకు సీఎం జగన్ ఆదేశాలు

Jaganann Vidya Deevina launches CM Jagan
  • ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెప్పాం
  • ఏమైనా సమస్యలుంటే 1902 కు తల్లిదండ్రులు ఫోన్ చేయాలి
  • ‘జగనన్న విద్యా దీవెన’ ను ప్రారంభించిన జగన్
ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజు కట్టివుంటే కనుక ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెప్పామని అన్నారు.

ఏమైనా సమస్యలుంటే విద్యార్థుల తల్లిదండ్రులు 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యా శాఖలో కాల్ సెంటర్ ఉంటుందని, దీనిపై సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గొప్పగా చదివించాలని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా'నని జగన్ అన్నారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Jagananna Vidya Deevina

More Telugu News