Vijayanirmala: విజయనిర్మల బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నరేశ్!

There is no plans of Vijayanirmala biopic says Naresh
  • ఈ వార్తలు నిజం కాదు
  • బయోపిక్ ను నిర్మించడం లేదు
  • ఇతరులకు పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు
తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు కూడా వార్తలు వచ్ఛాయి.

ఈ వార్తలపై విజయనిర్మల కుమారుడు, సినీ నటుడు నరేశ్ స్పందించారు. బయోపిక్ నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అమ్మ పేరుతో బయోపిక్ ను నిర్మించడం లేదని... ఇతరులు ఎవరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో, బయోపిక్ వార్తలకు తెర పడినట్టయింది.
Vijayanirmala
Biopic
Tollywood
Naresh
Keerthy Suresh

More Telugu News