కేఏ పాల్ చారిటీలో అవస్థలు పడలేకున్నాం... అధికారులకు ఫోన్ చేసిన విద్యార్థులు!
- సదాశివపేటలో పాల్ గమ్ సిటీ
- సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఫిర్యాదు
- పోలీసుల సాయంతో సోదాలు చేసిన అధికారులు
- ఇన్ చార్జ్ ని పిలిపించి హెచ్చరికలు
ఇక్కడ తమకు సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించిన వారు, రోజుకు ఒక్కసారే వండి, దాన్నే రెండు పూటలా పెడుతున్నారని తెలిపారు. నిత్యమూ టమాటా చారు, సాంబారు అన్నమే పెడుతున్నారని, రాత్రుళ్లు పాములు వస్తున్నాయని వాపోయారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన అంజయ్య, ఇన్ చార్జ్ ని పిలిపించి, మూడు పూటలా విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారాన్ని మాత్రమే అందించాలని ఆదేశించారు. ఇన్ చార్జ్ తో స్టోర్ రూమును తెరిపించిన ఆయన, అక్కడున్న పిల్లలకు స్నాక్స్ అందించారు. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు.