ఎన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు?: మంత్రి హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు?: మంత్రి హరీశ్ రావు

Telangana Minister Harish Rao Statement
  • రైతుల ముసుగులో ధాన్యాన్ని తగలబెడతారా?
  • చిల్లర రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలి
  • రాష్ట్రంలో ఆదాయం తగ్గినా ప్రజల సంక్షేమమే ముఖ్యం
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల ముసుగులో ధాన్యాన్ని తగలబెడుతున్నారని, చిల్లర రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దీక్షలు చేస్తున్న నేతలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పశ్చిమ బెంగాల్ నుంచి గన్నీ బ్యాగ్స్ తెప్పించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గినప్పటికీ ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అన్నారు.

 





Harish Rao
TRS
Telangana
Corona Virus
lock down

More Telugu News