చివరి కరోనా పేషెంట్ ను డిశ్చార్జి చేసిన వుహాన్ ఆసుపత్రి
- కరోనా వైరస్ జన్మస్థానంగా నిలిచిన వుహాన్ సిటీ
- 50,333 కేసులు నమోదు, 3,869 మంది మృతి
- వుహాన్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లెవరూ లేరని అధికారులు వెల్లడి
దీనిపై చైనా జాతీయ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ, "ఏప్రిల్ 26 నాటికి వుహాన్ లో కరోనా పేషెంట్లెవరూ లేరు. ఈ సందర్భంగా వుహాన్ వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చివరి పేషెంట్ ఎంతో విపత్కర పరిస్థితులను అధిగమించి కోలుకున్నారు" అని వివరించారు. కరోనా పుట్టుకకు కేంద్రస్థానంగా నిలిచిన వుహాన్ నగరంలో 50,333 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు.