KCR: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకుందాం : సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
- మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోనే పార్టీ జెండా ఎగురవేయాలి
- గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం అనేక అద్భుతాలు చూపించింది
రేపు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం అనేక అద్భుతాలు చూపించిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకుందామని, మరో సందర్భంలో ఘనంగా నిర్వహించుకోవచ్చని సూచించారు.
ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ ప్రాంతాల్లోనే నిరాడంబరంగా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కాగా, రేపు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను కేసీఆర్ ఎగురవేయనున్నారు.