Sundar Pichai: సుందర్ పిచాయ్ గతేడాది ప్యాకేజీ ఎంతో తెలుసా?

Sundar Pichai gets annual package at high
  • 2019కి గాను 281 మిలియన్ డాలర్ల నజరానా
  • గతేడాది వేతనం 6.5 లక్షల డాలర్లు
  • ఈ ఏడాది 20 లక్షల డాలర్లకు పెంపు
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ గతేడాదికి గాను 281 మిలియన్ డాలర్ల ప్యాకేజి అందుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునే చీఫ్ ఎగ్జిక్యూటివ్ లలో పిచాయ్ కూడా ఉన్నారు.

 అయితే పిచాయ్ వార్షిక పారితోషికంలో ఎక్కువభాగం షేర్లు, స్టాక్ అవార్డులే. ఈ కారణంగా పిచాయ్ కు దక్కే నజరానా ఊహించనంత తక్కువ మొత్తానికి పడిపోవచ్చు, లేకపోతే మరింత రెట్టింపు అవ్వొచ్చు. పిచాయ్ కు ఇచ్చే ప్యాకేజీలో షేర్లు, స్టాక్ అవార్డులు ఉండడంతో మార్కెట్ స్థితిగతులను అనుసరించి ఆయన ప్యాకేజి విలువ మారుతూ ఉంటుంది.

ఇక పిచాయ్ కి ఇచ్చే ఈ భారీ ప్యాకేజి ఆల్ఫాబెట్ ఉద్యోగుల మొత్తం వేతనాల కంటే 1085 రెట్లు ఎక్కువ. ఇక ఆయన వేతనం విషయానికి వస్తే 2019లో 6.5 లక్షల డాలర్లు అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఆయనకు వేతనంగా 2 మిలియన్ డాలర్లు ఇస్తున్నట్టు ఆల్ఫాబెట్ వర్గాలు తెలిపాయి.
Sundar Pichai
Alphabet
CEO
Package
Google

More Telugu News