Uday Kiran: ఉదయ్ కిరణ్ ఉండుంటే ఇంకా మంచి హీరో అయ్యేవాడు: దర్శకుడు వీఎన్ ఆదిత్య

VN Aditya Movie
  • ఉదయ్ కిరణ్ మంచి హీరో
  • ఎమోషన్స్ బాగా పండించేవాడు
  • ఇప్పుడు ఆయన ఉంటే బాగుండేదన్న వీఎన్ ఆదిత్య
తెలుగు తెరపై హిట్ చిత్రాలను ఆవిష్కరించిన దర్శకులలో వీఎన్ ఆదిత్య ఒకరు. 'మనసంతా నువ్వే' .. 'నేనున్నాను' .. 'బాస్' వంటి చిత్రాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలుగా కనిపిస్తాయి. అలాంటి వీఎన్ ఆదిత్య .. ఉదయ్ కిరణ్ హీరోగా 'మనసంతా నువ్వే' వంటి ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించారు. 'శ్రీరామ్' సినిమాతో ఉదయ్ కిరణ్ లోని యాక్షన్ హీరోను చూపించారు.

తాజా ఇంటర్వ్యూలో వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. "ఉదయ్ కిరణ్ ఆ రోజున ఆ తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే, ఇప్పుడు ఇంకా మంచి హీరోగా ఉండేవాడు. ఫ్యామిలీ స్టోరీస్ కి ఉదయ కిరణ్  బాగా పనికొస్తాడు. ఎమోషన్స్ తో కూడిన డ్రామాను పండించడమెలాగో ఆయనకి తెలుసు. ఆ తరహా కథలను తయారు చేసుకున్న దర్శక నిర్మాతలకు ఉదయ్ కిరణ్ ఇప్పుడు మంచి ఆప్షన్ అయ్యుండేవాడు. ప్రేక్షకులచే అంతగా ఆదరించబడిన ఆయన ఇప్పుడు ఉండుంటే ఇంకా మంచి హీరో అయ్యుండేవాడు" అని చెప్పుకొచ్చారు.
Uday Kiran
VN Aditya
Manastha Nuvve Movie

More Telugu News