లక్నోలో కనిపించిన నెలవంక... రేపటి నుంచి రంజాన్ మాసం షురూ
- శనివారం 'రోజా' (ప్రార్థన)తో రంజాన్ నెల ఆరంభం
- నిర్ధారించిన షియా, సున్నీ కమిటీలు
- మే 25న రంజాన్ తో ఉపవాసాల ముగింపు
ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఉపాధ్యక్షుడు, సీనియర్ మతగురువు మౌలానా కల్బే సాదిక్ ఈ విషయాన్ని గురువారమే ప్రకటించారు. అయితే ఆయన ఖగోళ అంశాల ఆధారంగా ఈ విషయం వెల్లడించారు. చివరికి నెలవంక కనిపించడంతో అధికారికంగా నిర్ధారణ అయింది. కాగా, ముస్లింలు తమ ఉపవాసాల పరంపరను మే 25న రంజాన్ తో ముగిస్తారు.