ఉత్తరాఖండ్ లో పసికందులపైనా క్వారంటైన్ కేసు నమోదు!
- కేసులు నమోదైన వారిలో 6 నెలల శిశువు, మూడేళ్ల చిన్నారులు
- విచారణకు ఆదేశాలు జారీచేసిన ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్
- క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి
ఈ వ్యవహారంలో రాష్ట్ర అధికారులపై విమర్శలు వస్తున్నాయి. బాలనేరస్తుల చట్టం ప్రకారం 8 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలిచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కొవిడ్-19 అధికారిని తప్పించడంతో సహా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.