Devineni Uma: సామాన్యులపై లాఠీలు, గుంపులుగా వస్తున్న మీ వాళ్లపై పూలవర్షమా?: దేవినేని ఉమ

Devineni Uma questions AP government over lock down breaches
  • రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్
  • రోడ్లపైకి వస్తున్న ప్రజలను లాఠీలతో కొడుతున్నారన్న ఉమ
  • మీ వాళ్ల చర్యలపై ఏం చెబుతారంటూ సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్   
కరోనా కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాక రోడ్లపైకి వస్తున్న ప్రజలను పోలీసుల లాఠీలతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. "కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజల మీద మీ సర్కారు లాఠీలు విదిలిస్తోంది. కానీ, బాధ్యతను విస్మరించి, పబ్లిసిటీ కోసం గుంపులు, గుంపులుగా ట్రాక్టర్ ర్యాలీలు, పూలవర్షాలు, రిబ్బన్ కటింగులు చేస్తున్న మీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల చర్యలపై ఏం సమాధానం చెబుతారు సీఎం గారూ!" అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, తన వ్యాఖ్యలకు ఆధారంగా కొన్ని ఫొటోలను కూడా ఉమ పోస్టు చేశారు.
Devineni Uma
Lockdown
Lathi Charge
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News