Nizamabad: నిజామాబాద్ లో పీపీఈ కిట్స్ ధరించిన బ్యాంకు ఉద్యోగులు!

Nizamabad SBI branch employees wear PPE Kits
  • రెడ్ జోన్ లో ఉన్న నిజామాబాద్ లోని ఎస్బీఐ బ్రాంచ్  
  • ప్రతి ఉద్యోగికి రెండు జతల పీపీఈ కిట్స్
  • ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిట్స్ ధరిస్తున్నామన్న ఉద్యోగులు
‘కరోనా’ నేపథ్యంలో తెలంగాణలో ప్రప్రథమంగా పీపీఈ కిట్స్ ధరించి బ్యాంకు ఉద్యోగులు విధులు నిర్వహించారు. నిజామాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ లో ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కిట్స్ ధరించారు. స్థానిక వర్ని చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగులు పీపీఈ కిట్స్ ధరించి వినియోగదారులకు సేవలు అందించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెడ్ జోన్ లో ఉన్న బ్రాంచ్ లకు పీపీఈ కిట్స్ అందిస్తున్నారని, ప్రతి ఉద్యోగికి రెండు జతల పీపీఈ కిట్స్ ఇచ్చారని ఆ బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆర్థిక సాయం తాలూకు డబ్బును తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుకు వస్తున్నారని అన్నారు.
Nizamabad
SBI
Employees
PPE kits

More Telugu News