MS Dhoni: అప్పుడు ధోనీ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతాడు: రోహిత్

MS Dhoni goes underground when hes not playing cricket says Rohit Sharma
  • ఆటకు దూరమయ్యాక అతను ఎవ్వరికీ దొరకడు
  • మహీ ఆడుతాడో లేదో మాకు తెలియదు
  • తెలుసుకోవాలనుకుంటే రాంచీ వెళ్లి అతడినే అడగండి
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ  క్రికెట్ ఆడడం ఆపేస్తే  ఎవ్వరికీ దొరకడని, అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతాడని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వన్డే ప్రపంచకప్  తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త వస్తోంది.

 ఐపీఎల్‌తో అతను జాతీయ జట్టులో పునరాగమనం చేస్తాడని భావిస్తే, కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడంతో ధోనీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే, అతని భవిష్యత్తు  ప్రణాళికలపై తనకేమీ తెలియదని రోహిత్ అన్నాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్లు ధోనీనే అడగాలని అన్నాడు. ఈ మేరకు హర్భజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.

‘ఒకవేళ క్రికెట్ ఆడడం ఆపేస్తే.. ధోనీ ఎవ్వరికీ కనిపించడు. అతను అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతాడు. ధోనీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్లు వెళ్లి అతడినే అడగాలి. ధోనీ రాంచీలోనే ఉంటాడని మీకందరికీ తెలుసుగా. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే కారు, బైక్ లేదా విమానం ఎక్కి నేరుగా రాంచీ వెళ్లండి.  మీరేం చేయబోతున్నారు?  మళ్లీ ఆడుతారా లేరా? అని మహీనే ప్రశ్నించండి. అతని గురించి మాకేమీ తెలియదు. గతేడాతి జూలైలో చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం మాకు లేదు’ అని రోహిత్ పేర్కొన్నాడు.
MS Dhoni
goes
underground
Rohit Sharma

More Telugu News