తెలంగాణలో మరో 23 మందికి కరోనా పాజిటివ్

Corona positive cases raises in Telangana
  • మొత్తం కేసుల సంఖ్య 970
  • కరోనాతో తెలంగాణలో 25 మంది మృతి
  • ఏపీలోనూ కొనసాగుతున్న కరోనా ప్రభావం
తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఎక్కువగానే వుంది. తాజాగా ఇవాళ మరో 23 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 970కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 262 కాగా, 25 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అటు, ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 893కి పెరిగింది. 27 మంది ప్రాణాలు విడిచారు. గత 24 గంటల్లో ఏకంగా 80 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive
Deaths
Andhra Pradesh
COVID-19

More Telugu News