Central Government Employees: కరోనా ఎఫెక్ట్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత

Discontinuation of DA hike to central government employees
  • 2020 జనవరి 1 - 2021 జులై వరకు డీఏ పెంపు నిలిపివేత
  • ప్రస్తుతం చెల్లిస్తున్న డీఏనే  2021 జులై వరకు  కొనసాగింపు
  • ఈ నిర్ణయంతో కేంద్రానికి రూ.37,530 కోట్ల మేరకు ఆదా
‘కరోనా’ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం ప్రభావం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏపై పడింది. ఉద్యోగులకు ఇచ్చే డీఏ పెంపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుంచి  2021 జులై వరకు డీఏ పెంపు ఉండదని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. 2021 జులై వరకు ప్రస్తుతం చెల్లిస్తున్న డీఏనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛన్ దారులపై పడుతుంది. డీఏ పెంపు నిలిపివేతతో కేంద్రానికి రూ.37,530 కోట్ల మేరకు ఆదా కానుంది.
Central Government Employees
DA
Hike
Cancellation

More Telugu News