Santosh Kumar: కేసీఆర్ దంపతుల అరుదైన ఫొటో పోస్టు చేసిన ఎంపీ సంతోష్ కుమార్

TRS MP Santosh Kumar posts a rare pic of CM KCR couple
  • కేసీఆర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
  • ఇలాంటి పెదనాన్న, పెద్దమ్మ లభించడం భగవదనుగ్రహంగా భావిస్తున్నట్టు ట్వీట్
  • సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ దంపతులకు సంబంధించిన అరుదైన ఫొటో పోస్టు చేశారు. ఇవాళ ఎంపీ సంతోష్ కుమార్ తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళల పెళ్లిరోజు మాత్రమే కాకుండా కేసీఆర్ దంపతుల పెళ్లి రోజు కూడా! ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

"మీలాంటి అమ్మానాన్న, మీలాంటి పెదనాన్న, పెద్దమ్మ నాకు లభించడం భగవదనుగ్రహంగా భావిస్తాను. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు మీరే. మీ రెండు జంటలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నాను" అంటూ పేర్కొన్నారు. కాగా, సంతోష్ కుమార్ పోస్టు చేసిన ఫొటోలో ఎంతో చిన్నవయసులో దంపతులుగా మారినప్పటి కేసీఆర్, ఆయన ఆర్ధాంగి శోభను చూడొచ్చు. ఈ ఫొటోలో సంతోష్ తల్లిదండ్రులు కూడా చిన్నవయసులోనే ఒక్కటైన జంటగా కనిపిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ, ఎంపీ సంతోష్ కుమార్ తల్లి శశికళ అక్కాచెల్లెళ్లు అన్న సంగతి తెలిసిందే.
Santosh Kumar
KCR
Anniversary
TRS
Telangana

More Telugu News