24 గంటల్లో 1409 కేసుల నమోదు... 21  వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

  • దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రం
  • నిత్యం వెయ్యికి పైగా కేసులు
  • దేశవ్యాప్తంగా 681 మంది మృతి
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 1409 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 21,393కి పెరిగింది. ఇప్పటివరకు 4,257 మంది కోలుకున్నారు. రోగుల రికవరీ రేటు 19.89గా నమోదైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో 16,454 మంది ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తమ్మీద మరణాల సంఖ్య 681గా నమోదైంది. ఇక గడచిన 28 రోజుల్లో 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా వెల్లడి కాలేదు.

Corona Virus
India
Positive Cases
Deaths
COVID-19

More Telugu News