Corona Virus: నన్ను, నా కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చేర్చుకోలేదు: కరోనా పాజిటివ్ బాధితుడు

Corona positive man alleges Delhi hospital refused to admit
  • ఢిల్లీలో ఒక కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్
  • ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకున్న బాధితులు
  • ముగ్గురుని ఆసుపత్రిలో చేర్చుకున్నామన్న సూపరింటెండెంట్
ఢిల్లీలోని ప్రఖ్యాత లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి తనను అనుమతించలేదని ఓ కరోనా పాజిటివ్ బాధితుడు ఆరోపించారు. ముగ్గురు బంధువులతో కలిసి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లానని... తనకు వైద్యాన్ని అందించేందుకు నిరాకరించారని చూరీవాలా ప్రాంతానికి చెందిన నసీమ్ అనే వ్యక్తి తెలిపారు. తన కుటుంబంలో ఏడుగురు కరోనా బారిన పడ్డారని చెప్పారు. తామంతా ఓ ప్రైవేట్ ల్యాబ్ లో టెస్టులు చేయించుకుంటే తమకు కరోనా పాజిటివ్ అని తేలిందని... దీంతో చికిత్స కోసం లోక్ నాయక్ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు.

తాను, తన కుమారుడు, సోదరుడు, మేనల్లుడు ఆసుప్రతి ముందే ఉన్నామని... తాము చెబుతున్నది వైద్య సిబ్బంది వినడం లేదని ఆయన వాపోయారు. తమ ఆరోగ్య పరిస్థితిని పోలీసులకు కూడా తెలిపామని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది తమకు వైద్యం అందించాలని విన్నవించారు. తమను ఆసుపత్రిలో చేర్చుకుంటే... తమ కుటుంబంలోని ఇతరులను కూడా ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు. కుటుంబంలో రెండు నెలల చిన్నారికి కూడా పాజిటివ్ వచ్చిందని ఆవేేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ జేసీ ప్యాసీ మాట్లడుతూ, ఇక్కడ క్యాటగిరీ 3 రోగులను మాత్రమే చేర్చుకుంటామని... ఐసీయూ, వెంటిలేషన్ సపోర్ట్ కావాల్సిన వారు ఈ కోవలోకి వస్తారని చెప్పారు. నసీమ్ కుటుంబానికి చెందిన ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చుకున్నామని తెలిపారు.
Corona Virus
Delhi
Lok Nayak Hospital

More Telugu News