ఈ వీడియో ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలనుంది: ఆర్జీవీ
- మోదీ, ట్రంప్‌పై ఆసక్తికర వీడియో
- దళపతి సినిమా పాటను ఎడిట్ చేసి రూపొందించిన వ్యక్తి
- ట్విట్టర్లో వర్మ షేర్ చేయడంతో వైరల్
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహాన్ని తెలియజేసేలా ఎడిట్ చేసిన వీడియో ఆర్జీవీని ఆకట్టుకుంది. రజనీకాంత్, మమ్ముట్టి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట’ అనే పాట తమిళ వర్షన్‌ను దీనికి జత చేశారు. రజనీకాంత్, మమ్ముట్టి స్థానాల్లో మోదీ, ట్రంప్‌లను చేర్చి పోటి పడుతూ పాట పాడినట్టు ఎడిట్ చేశారు. బుధవారం రాత్రి ఆర్జీవీ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది.