Simhachalam: అప్పన్న చందనోత్సవానికి ప్రజలు, వీఐపీలను ఆహ్వానించొద్దు: ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

Chandanostavam in Simhachalam
  • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించండి 
  • చందనోత్సవాన్ని  ప్రత్యక్ష ప్రసారం చేయండి  
  • దేవస్థానం ఈవోకు ఈ మేరకు ఆదేశాలు
విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వేడుకలకు ప్రజలు, వీఐపీలను ఎవరినీ ఆహ్వానించవద్దని దేవస్థానం ఈవోకు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది. నరసింహస్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఈవోను ఆదేశించింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది. 
Simhachalam

More Telugu News