Virat Kohli: అనుష్క నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా: కోహ్లీ

Have learnt to stay calm and patient from Anushka Sharma says Virat Kohli
  • ప్రశాంతత, ఓపిక నేర్చుకున్నా
  • గతంలో చాలా దూకుడుగా ఉండే వాడిని
  • ఆనుష్కతో పరిచయం తర్వాత చాలా మారానని వెల్లడి
భార్య అనుష్క శర్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడం, ఓపిక వహించడం  నేర్చుకున్నానని చెప్పాడు. అనుష్క తన జీవితంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేనంత సహనం, ఓపిక పెరిగాయని చెప్పాడు.

‘నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నాలో అస్సలు ఓపిక ఉండేది కాదు.  ప్రతి చిన్న విషయానికి కోప్పడేవాడిని. ఇప్పుడు నాలో సహనం పెరిగింది. మేమిద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆమె వ్యక్తిత్వం, క్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా, ఓర్పుగా ఉండడం నాకు స్పూర్తినిచ్చింది. తొలిసారి స్టేట్ సెలక్షన్స్‌లో తిరస్కరణకు గురైనప్పుడు నేను చాలా బాధపడ్డా. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడు మాత్రం కఠిన సందర్భాల్లో సైతం ఓపిగ్గా ఉంటున్నా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Virat Kohli
Anushka Shetty
learnt
calm
patient

More Telugu News