Police: రోడ్డుపై తిరుగుతున్న వారందరికీ హారతిచ్చి, అరటి పండు చేతిలో పెట్టిన పోలీసులు!

Police perform aarti of people who violated
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఘటన
  • లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన యువకులు
  • వినూత్న రీతిలో బుద్ధి చెప్పిన పోలీసులు
లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా రోడ్డుపై తిరుగుతున్న వారందరినీ లైన్‌లో నిలబెట్టి.. హారతిచ్చి, అరటి పండు చేతిలో పెట్టారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఈ ఘటన కాన్పూర్‌లోని కిడ్వాయి నగర్‌లో చోటు చేసుకుంది. వారంతా లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. దేవుళ్లకు హారతి ఇస్తోన్న సమయంలో చదివే మంత్రాలను కూడా పోలీసులు చదివారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కరోనా విజృంభణ అధికంగా ఉంది. కాన్పూర్‌లోని 17 ప్రాంతాలను కట్టడి ప్రాంతాలు (కంటైన్మెంట్‌)గా ప్రకటించారు. కాన్పూర్‌లో ఎవరూ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తోన్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Police
Uttar Pradesh
Lockdown

More Telugu News