Telangana: కరోనా అప్ డేట్: తెలంగాణలో ఇవాళ 56 కొత్త కేసుల నమోదు

Fifty six more cases registered in Telangana today
  • రాష్ట్రంలో 928కి చేరిన మొత్తం కేసులు
  • ఇప్పటివరకు తెలంగాణలో 23 మంది మృత్యువాత
  • ఇవాళ సూర్యాపేట జిల్లాలో 26 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్థృతంగా ఉంది. ఇవాళ కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 928కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 23 అని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇవాళ్టి కేసుల్లో అత్యధికం సూర్యాపేట జిల్లాలో వెలుగుచూశాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఒక్కరోజే 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి.
Telangana
Corona Virus
Positive
Deaths
Suryapet District
GHMC
Hyderabad

More Telugu News